జొన్న రైతుల డబ్బుల విషయంలో ఆందోళన వద్దు
బోథ్,(విజయక్రాంతి): జొన్న పంటను విక్రయించిన రైతులు డబ్బుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్ పేర్కొన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 7 31 వేల 517 క్వింటాళ్ల జొన్నలను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అయితే రైతులకు రెండు వందల డెబ్బై కోట్ల 58 లక్షల 81 వేల 383 రూపాయలు బకాయిలు పడడం జరిగిందన్నారు.
అయితే ఇప్పటికే ప్రభుత్వం 2006 కోట్ల 44 లక్షల 65 వేల 330 రూపాయలు రైతులు అకౌంట్లోకి డబ్బులు పంపిణీ చేసిందన్నారు. మిగతా 50 కోట్ల 32 లక్షల 8643 రైతులకు చెల్లించాల్సి ఉందన్నారు. రైతులకు చెల్లించాల్సిన డబ్బులు త్వరలోనే ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి వేయడం జరుగుతుందని వివరించారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు.
కొంతమంది ప్రతిపక్ష పార్టీ నాయకులు రైతులకు పడ్డ బకాయిల విషయంలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. రైతాంగాన్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్న నాయకులకు రానున్న రోజుల్లో రైతులే బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పంట పునుగుల విషయంలో రాజీ పడకుండా కొనుగోలు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పంట కొనుగోళ్లకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎంతటి కష్టమైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు పక్షాన ఉంటుందని పేర్కొన్నారు.






