11 August, 2026 | 7:26 PM

రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో బంగారు, రజిత పథకాలు సాధించిన ఐపీఎస్‌ విద్యార్థులు

11-08-2026 05:24 PM

సుల్తానాబాద్‌,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఇండియన్‌ పబ్లిక్‌ పాఠశాల విద్యార్థులు టేబుల్‌ టెన్నిస్‌లో సత్తా చాటారు. ఇటీవల సుల్తానాబాద్‌ ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో నిర్వహించిన పెద్దపల్లి జిల్లా స్థాయి ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచి 9 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకింగ్‌ పోటీలకు ఎంపికయ్యారు. 11 సంవత్సరాల బాలుర విభాగంలో ఏ. అనంత్‌ బంగారు పతకం సాధించాడు. 13 సంవత్సరాల బాలబాలికల విభాగంలో టి. అభిజ్ఞశ్రీ బంగారు పతకం, వి. మనోభిరం రజత పతకం, రిదీష్‌ నందన్‌ కాంస్య పతకం సాధించారు.

15 సంవత్సరాల బాలికల విభాగంలో ఈ.వర్షిత బంగారు పతకం, ఎస్‌.సాత్విక రజత పతకం సాధించారు. 17 సంవత్సరాల బాలికల విభాగంలో కే.మనస్విని బంగారు పతకం, హరిణి, కావ్య కాంస్య పతకాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. విద్యార్థుల విజయంపై పాఠశాల చైర్మన్‌ మాటేటి సంజీవ్‌ కుమార్‌, ప్రిన్సిపల్‌ కృష్ణప్రియలు మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను తీర్చిదిద్దిన టేబుల్‌ టెన్నిస్‌ కోచ్‌ సత్యనారాయణను అభినందించారు.క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదలపెంపొందుతాయని పేర్కొన్నారు. క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు పాఠశాల తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ సునీత, మేనేజర్‌ శివ, పీఈటీలు సతీష్‌, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.