దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో జీవించాలి
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
ఎల్బీనగర్, ఏప్రిల్ 15: దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో జీవించాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సరూర్ నగర్ లోని జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం (డీడీ ఆర్సీ కేంద్రం)లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో బుధవారం దివ్యాంగు లకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, కందు కూరు ఆర్డీవో ఎన్.జగదీశ్వరరెడ్డి, సరూర్ నగర్ తహసీల్దార్ వేణుగోపాల్, సరూర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గీత, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధి మిట్టల్, నోడల్ అధికారి (డీడీఆర్సీ) రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు అనేక పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సరూర్‌నగర్‌లోని జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






