కోతులతో వేగలేక పోతున్నాం
28-02-2026 12:00 AM
కడెం, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): కడెం మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక ఉన్నత ఆశ్రమ బాలుర పాఠశాలను శుక్రవారం జాతీయ ఎస్టి కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ సందర్శించి ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల సమస్యలపై విద్యార్థులను ఆరా తీయగా కోతులు ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను అక్కడే ఆదేశించారు. కార్యక్రమంలో నిర్మల్ డిటిడబ్ల్యూ ఓ అంబాజీ జాదవ్, పాఠశాల హెచ్‌ఎం వసంతరావు, హెచ్‌డబ్ల్యుఓ రాంజీ, బిజెపి గిరిజన మోర్చా జాతీయ నాయకులు జి శ్రీ రామ్ నాయక్, బిజెపి జిల్లా నాయకులు ఇస్లావత్ మోహన్ నాయ క్, జక్కుల సత్తన్న, తదితరులు పాల్గొన్నారు.




