2 August, 2026 | 7:09 AM

విత్తనాలకు తప్పని తిప్పలు

28-05-2024 12:05 AM

కామారెడ్డి, మే 27 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో రెండో రోజూ జీలుగ విత్తనాల కోసం రైతులకు పడిగాపులు తప్పలేదు. కామారెడ్డి సింగిల్ విండో పరిధిలోని రైతులకు జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్‌లో జీలుగు విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తున్నారు.  రైతులు ఉదయం 4 గంటలకే వచ్చి బారులు తీరారు. అయితే, అధికారులు జీలుగ విత్తనాలను సరిపడా పంపిణీ చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుం చి పడిగాపులు కాశామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే సరిపడా విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. 

రైతులు ఆందోళన చెందొద్దు

జీలుగ, జనుము విత్తనాల కోసం రైతులు ఆందోళన చెందొద్దని, అవసరమైన రైతులందరికీ ఆన్‌లైన్ ద్వారా విత్తనాలను అందిస్తామని జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.