విద్యార్థినుల కోసం డిజిటల్ ల్యాబ్
సిద్దిపేట జిల్లా వర్గల్ మహాత్మా జ్యోతిబా ఫూలే
రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలో ప్రారంభించిన సీఎఫ్‌జీ గ్రూప్
హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): అమెరికాకు చెందిన ఆర్థిక సంస్థ సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ (సీఎఫ్‌జీ), హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ నిర్మాణ్ ఆర్గ నైజేషన్‌తో భాగస్వామ్యంతో సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో అతిపెద్ద డిజిటల్ ల్యాబ్‌ను ప్రారంభించింది.
100కు పైగా కంప్యూటర్లు, హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ ల్యాబ్ ద్వారా సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన సుమారు 700 మంది విద్యార్థినులకు డిజిటల్ శిక్షణ అం దించనున్నారు. విద్యా సంవత్సరం మొత్తం ఇద్దరు ప్రత్యేక శిక్షకులు శిక్షణ ఇవ్వనున్నారు.
మూడేళ్ల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కార్యక్రమంలో భాగంగా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ విద్యార్థినులకు ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఏఐ ఆధారిత కోర్సులు, డిజిటల్ నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలకు అవసరమైన శిక్షణ అందించనున్నారు. సీఎఫ్‌జీ సీఐఓ, హెడ్ ఆఫ్ ఈటీఎస్ మైకేల్ రట్లెడ్జ్ మాట్లాడుతూ.. కంప్యూటర్ అందించడం మాత్రమే కాదు, సరైన శిక్షణ, మార్గదర్శకత్వం, టెక్నాలజీ పరిజ్ఞానం విద్యార్థుల భవిష్యత్తును మార్చగలవు అన్నారు.
కాగ్నిజెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శైలజ జోస్యుల మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, ముఖ్యం గా యువతులకు భవిష్యత్ ఉద్యోగావకాశాలకు అవసరమైన నైపు ణ్యాలు అందిం చేందుకు కాగ్నిజెంట్ కృషి చేస్తోంది. సిటిజన్స్ డిజిటల్ ఎంపవర్మెంట్ ల్యాబ్ వంటి కార్యక్రమాలు విద్య, పరిశ్రమల మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తాయ న్నారు. తెలంగాణ గురుకులాల కార్యదర్శి సైదులు మాట్లాడు తూ.. ప్రస్తుతం డిజిటల్ నైపుణ్యాలు ఎంతో అవసరం.
ఈ తరహా భాగస్వామ్యాలు గ్రా మీణ మహిళా విద్యార్థుల విద్యా ప్రమాణాలు, ఉపాధి అవకాశా లను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయ న్నారు. మయూర్ పట్నా ల, నిర్మాణ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ అండ్ గ్లోబల్ సీఈయూ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన డిజిటల్ విద్య అందించేందుకు సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ ముందుకు రావడం ఆనందంగా ఉం ది. విద్య మా సంస్థ ప్రధాన లక్ష్యం అన్నారు.






