16 May, 2026 | 2:16 AM

యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

16-05-2026 01:25 AM

అలంపూర్ మే 15: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవ కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయ దినోత్సవాన్ని మానవపాడు మండల కేంద్రంలో గ్రంథాలయ సంస్థ లైబ్రరీయన్ జి. మాణిక్యమ్మ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈవో శివ ప్రసాద్,గ్రామ సర్పంచ్ రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ ...ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించడం, విద్యార్థుల్లో జ్ఞాన వికాసాన్ని ప్రోత్సహించడం, డిజిటల్ గ్రంథాలయ సేవలను ప్రజలకు చేరువ చేయడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా తెలిపారు.గ్రంథాలయాలు సమాజ అభివృద్ధికి మూలస్తంభాలని, ప్రతి విద్యార్థి మరియు యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అనంతరం పాఠకులకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం పాఠకులతో కలిసి న్యూస్ పేపర్లను పోటీ పరీక్షల పుస్తకాలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది జి. గోకారి, పరమేష్, మల్లికార్జున్, రమేష్,నాయుడు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.