పెద్ద చెరువు చిన్నబోయేలా!
విచ్చలవిడిగా మట్టి తరలింపు
ఇటుక బట్టీలకు భారీగా విక్రయం
సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు
చోద్యం చూస్తున్న అధికారులు
మంథని, మే 15 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలంలోని జూలపల్లి పెద్ద చెరువులో మట్టి తరలింపు దందా యథేచ్చగా కొనసాగుతుంది. వ్యవసాయ పనులకు మట్టి తరలింపు పేరుతో గత మూడు రోజులుగా చెరువు మట్టిని తరలిస్తున్నారు. గతంలో మిషన్ కాకతీయ పేరు తో పూడిక తీయించగా, ప్రస్తుతం వ్యవసాయ భూములకు మట్టి తరలింపు పేరుతో కొత్త దందాకు తెరతీశారు. ప్రభుత్వానికి ఎలాంటి ఖర్చు లేకుండా పూడిక పోతుందని అనుమతులు ఇచ్చింది. అయితే, వ్యవ సాయ భూములకు మట్టితోలకం పేరుతో మొదలైన దందా వెంచర్లు, ఇటుక బట్టీలకు తరలించే వరకు వెళ్లింది.
మూడు రోజులుగా, చెరువులో మట్టిని ఇష్టారీతిగా విక్ర యించుకుంటున్నారు. పేరుకు వ్యవసాయ భూములకు తోలుతున్నట్లు కనిపిస్తున్నా.. వాణిజ్య అవసరాలకు తరలిస్తున్నారు. వ్యవసాయ భూములకు మట్టి తరలించాలంటే సంబంధిత ఏఈ ధ్రువీకరణతో ఇరిగేషన్ శాఖ డీఈకి దరఖాస్తు చేసుకుంటే ఉచితంగానే మట్టి తరలించడానికి అనుమతులు ఇస్తారు. వాణిజ్య అవసరాల కోసం మట్టి కావాలంటే ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించి అనుమతులు తీసుకోవాలి. గత మూడు రోజులుగా ఏదో ఒక పేరుతో అడ్డగోలుగా మట్టిని తరలిస్తున్నారు.
ఎవరైనా అడిగితే తాము రైతులకు మట్టితోలుతున్నామని. మావద్ద అనుమతులు ఉన్నాయని బుకాయిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ౬ వరకు మాత్ర మే మట్టి తరలించాల్సి ఉన్నా.. అక్రమర్కులు రాత్రి వేళలో కూడా ఇష్టానుసారంగా మట్టి కొల్లగొడుతున్నారు. దాదాపు ఐదు జేసీబీలు, 60 లారీలతో నిరంతరం మట్టిని తర లిస్తుండటంతో దీంతో వారి దందా మూడు జేసీబీలు.. ఆరు లారీలుగా సాగుతుంది. అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండ గా అక్రమార్కులు తమ పని తాము కానిస్తున్నారు.
ఒక్కో ట్రిప్పు వేలల్లో అమ్ముకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్ర మార్కులు దర్జాగా తహసీల్దార్ కార్యాల యం, పోలీస్ స్టేషన్, ఇరిగేషన్ శాఖ కార్యాలయం ముందు నుంచే లారీలతో మట్టి తర లిస్తున్నా.. పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా మట్టి అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తిచేస్తున్నారు.




