17 April, 2026 | 8:44 AM

దర్శకుడు రవికుమార్ చౌదరి కన్నుమూత

12-06-2025 12:00 AM

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచి నట్టు తెలుస్తోంది. గోపిచంద్ హీరోగా నటించిన ‘యజ్ఞం’ సినిమాతో దర్శకుడుగా పరిచయమైన ఏఎస్ రవికుమార్ ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని బాలకృష్ణతో ‘వీరభద్ర’ తీశారు.

ఇంకా ఆయన నితిన్‌తో ‘ఆటాడిస్తా’, తనిశ్‌తో ‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’, సాయిదుర్గతేజ్‌తో ‘పిల్లా నువ్వులేని జీవితం’ వంటి సినిమాలు తెరకెక్కించారు. గోపిచంద్‌తో రెండో సినిమా ‘సౌఖ్యం’ కూడా తీయగా.. రాజ్‌తరుణ్‌తో ‘తిరగబడరా సామి’ ఆయన తీసిన చివరి సినిమా కావటం గమనార్హం. తెలుగు దర్శకుల సంఘం సంతాపం ప్రకటించింది.