2 May, 2026 | 8:51 PM

Breaking News

అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •   ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •   బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •   అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు   •   మాల్ తుమ్మెదలో.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన స్వరూప కాటం   •  

దివ్యాంగులు సదరం వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

11-03-2026 05:02 PM

 జిల్లా కలెక్టర్ కె. హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): దివ్యాంగులు సదరం వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సదరం శిబిరాన్ని కలెక్టర్ కె. హరిత, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తరావుతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా శిబిరానికి వచ్చే దివ్యాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కె. హరిత మాట్లాడుతూ... దివ్యాంగులకు త్రాగునీరు, వీల్ చైర్ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. స్లాట్ బుక్ చేసుకున్న వారు తప్పనిసరిగా సదరం శిబిరానికి వచ్చేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. సదరం శిబిరాల్లో కంటి చూపు లోపం, మానసిక వైకల్యం, రక్త సంబంధిత వ్యాధులు, సికిల్ సెల్, తలసేమియా, హీమోఫీలియా, మూగ-చెవిటి, ఎముకల సంబంధిత వైకల్యాలు తదితర సమస్యలపై పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఎం రామకృష్ణ, వైద్యులు, సిబ్బంది, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.