11 March, 2026 | 6:49 PM

మురికి కాలువతో ఇబ్బందులు

11-03-2026 05:05 PM

చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలోని ప్రధాన గాంధీ చౌరస్తా వద్ద ఉన్న ఓ మెడికల్ దుకాణం పక్కన మురికి కాలువను కొద్ది రోజులుగా శుభ్రం చేయకపోవడంతో చెత్త పేరుకుపోయి దుర్వాసన, దోమల సమస్య పెరిగిందని గ్రామస్తులు తెలిపారు. కాలువలో మురుగు నీరు నిల్వ ఉండటంతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దోమల కారణంగా వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించి కాలువను శుభ్రం చేసి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.