calender_icon.png 24 December, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం

28-10-2024 12:12:48 AM

ఎల్బీనగర్, అక్టోబర్ 27: ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన ఆదివారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహరాష్ట్రకు చెందిన మార్దీప్‌సింగ్ దయాసింగ్(40) భార్య కిరణ్‌కౌర్‌తోపాటు ముగ్గురు పిల్లలతో కలిసి హయత్‌నగర్‌లో నివాసముంటున్నాడు. కాగా భార్యాభర్తల మధ్య కుటుంబ గొడవలు జరిగాయి. దీంతో తన భార్య కిరణ్‌కౌర్ (30) పిల్లలు అమన్‌జిత్(9), జాస్మిన్(7), సిమ్రాన్(4)ను తీసుకుని వెళ్లి, తిరిగి ఇంటికి రాలేదని భర్త దయాసింగ్ పేర్కొన్నాడు.