11 March, 2026 | 4:16 AM

పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములు కావాలి

10-03-2026 10:02 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): పరిసరాల పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములు కావాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో మంగళవారం ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ఖాళీ ప్రదేశాల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా వెంటనే తొలగించాలని సూచించారు.

అలాగే మురుగునీటి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచి పరిశుభ్ర వాతావరణాన్ని కల్పించాలని అధికారులకు ఆదేశించారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు కూడా సహకరించాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆనంద్, ఎంపీవో సత్యనారాయణ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.