11 March, 2026 | 11:45 AM

భార్యాభర్తల గొడవ… కాలువలో దూకిన మహిళ

10-03-2026 10:06 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా ఓ మహిళ ఆవేశంలో నిజాంసాగర్ ప్రధాన కాల్వలో దూకిన సంఘటన నిజాంబాద్ జిల్లా వర్ని వద్ద చోటుచేసుకుంది. కోటగిరికి చెందిన భార్యాభర్తలు వర్ని బస్టాండ్ వద్ద వ్యక్తిగత కారణాలతో గొడవపడ్డారు. ఈ గొడవతో మనస్తాపానికి గురైన భార్య లక్ష్మి క్షణికావేశంలో సమీపంలోని నిజాంసాగర్ ప్రధాన కాల్వలోకి దూకింది.

దీనిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సహాయంతో కాల్వలోకి దూకిన లక్ష్మిని నీటిలో నుంచి బయటకు తీసి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల అప్రమత్తత వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని పలువురు తెలిపారు.