27 June, 2026 | 8:05 AM

న్యూజిలాండ్‌కు నిరాశ

15-06-2024 01:14 AM

ఐసీసీ టోర్నీల్లో అత్యంత నిలకడైన జట్టుగా గుర్తింపు తెచ్చుకున్న న్యూజిలాండ్‌కు ఈ మెగాటోర్నీ పీడకలను మిగిల్చింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన కివీస్.. మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సూపర్ రేసు నుంచి తప్పుకుంది. 2021లో ఫైనల్ చేరిన కివీస్ ఈ సారి వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ చేతిలో పరాజయం పాలై గ్రూప్ పాయింట్ల పట్టిక అట్టడుగున నిలిచింది. ఉగాండా, పపువా న్యూగినియాతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా.. సూపర్ చేరే చాన్స్ మాత్రం కోల్పోయింది.