బాన్సువాడలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి
బాన్సువాడ, ఆగస్టు 20: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశంలో అతి పిన్న వయసులోనే ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ, ఆధునిక భారత నిర్మాణానికి విశేష కృషి చేశారని కొనియాడారు. ముఖ్యంగా దేశంలో ఐటీ రంగం అభివృద్ధికి ఆయన బాటలు వేశారని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ అమలు చేసిన అనేక సంస్కరణల ఫలితంగానే దేశం వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యుడు అలీ బిన్ అబ్దుల్లా, మాజీ సొసైటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ ఏజాజ్, మాజీ ఏఎంసీ చైర్మన్ నార్ల రవీందర్, ఆత్మ కమిటీ అధ్యక్షుడు మశాని రవీందర్‌రెడ్డి, అజీం, వహబ్‌షా, హాబీబ్ బాబా, దాసరి శ్రీను, మట్ట సాయిలు, కౌన్సిలర్లు ఖాలేఖ్, హకీం, నందు, రమేష్, యూత్ అధ్యక్షుడు మన్సూర్, రఫీ, ఇలియాస్ అలీ, సాదక్ తదితరులు పాల్గొన్నారు.






