20 August, 2026 | 5:30 PM

మహిళా పాలిటెక్నిక్ కళాశాల ముందు బిఆర్ఎస్వి నిరసన

20-08-2026 04:53 PM

ముకరంపుర,(విజయక్రాంతి): శక్తి స్కీమ్,జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ముందు బిఆర్ఎస్వి  జిల్లా అధ్యక్షుడు ,మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్  ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పిపిపి మోడ్ లో వ్యవస్థను నిర్ణయించడం అంటే ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు దారదత్వం చేయడమేనని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచితంగా అందాల్సిన విద్యను ప్రైవేట్ భాగస్వామ్యంలో నడిచే స్కిల్ వర్సిటీకి అప్పగిస్తే భవిష్యత్తులో పేద విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరం చేసే కుట్ర రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర అని, గతంలో పాలిటెక్నిక్ ముగిశాక నేరుగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలోకి లెటరల్ ఎంట్రీ అవకాశం ఉండేది.

కానీ ఈ విలీనం వల్ల ఆ సదుపాయం ఉండదని అన్నారు.మహబూబాబాద్‌ కలెక్టర్ కార్యాలయం వద్ద జీఓ నెంబర్ 97ను రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన చేస్తా వుంటే  సీఐ రఘుపతి రెడ్డి విద్యార్థి గొంతు నొక్కుతూ, క్రూరంగా వ్యవహరించిన పోలీసు అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి లేనిపక్షంలో విద్యార్థి లోకం సత్తా ఏంటో చూపిస్తామని పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్  వి నగర అధ్యక్షులు బొంకూరి మోహన్  తదితరులు పాల్గొన్నారు.