27 June, 2026 | 6:52 AM

జోరుగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

15-06-2024 01:16 AM

హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: నవ్ శక్తి క్రీడా మండల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్‌లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) జట్టు ముందంజ వేసింది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో సాయ్ టీమ్ 29 తేడాతో శ్రీ కృష్ణ క్లబ్‌పై విజయం సాధించగా.. నవ్ శక్తి క్రీడా మండల్ 44 వరంగల్ టీమ్‌పై గెలుపొందింది. ఇతర మ్యాచ్‌ల్లో సూర్యాపేట 34 తేడాతో సాట్స్ జట్టుపై, ఆర్‌ఆర్‌సీ 37 తేడాతో సంగారెడ్డిపై విజయాలు సాధించి ముందంజ వేశాయి. మూడు రోజుల పాటు పోటీలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.