26 July, 2026 | 1:12 AM

శ్రీహరి నటరాజ్‌కు నిరాశ

26-07-2026 12:38 AM

తృటిలో చేజారిన పతకం

గ్లాస్గో , జూలై 25 : కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్విమ్మర్ శ్రీహరి నటరాజ్‌కు తృటిలో పతకం చేజారింది. పురుషుల 50 మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో ఫైనల్ చేరలేకపోయాడు. సెమీస్ చేరి పతకంపై ఆశలు రేకెత్తించిన శ్రీహరి అసలు పోరులో మాత్రం వెనుకబడ్డాడు. ఫైనల్స్‌లో రేసును 25.29 సెకన్లలో పూర్తి చేసి ఏడో స్థానంలో నిలిచాడు.

సెమీస్‌లో శ్రీహరి ప్రదర్శన చూసిన తర్వాత ఖచ్చితంగా మెడల్ గెలుస్తాడని అనిపించినా అసలు పోరులో మాత్రం నిరాశపరిచాడు. అలాగే ఇద్దరు పారాస్విమ్మర్లు సైతం కొద్దిలో పతకాలు మిస్సయ్యారు. 100 మీ. ఫ్రీస్టుల్ ఎస్13 ఫైనల్లో బుడిగిన నాలుగో స్థానంలో నిలిచాడు. రేసును 57.57 సెకన్లలో పూర్తి చేసిన అతడికి మూడో స్థానంలో నిలిచిన స్కాట్లాం డ్ స్మిమ్మర్ జేమ్స్‌కు మధ్య 0.71 సెకన్ల తేడానే ఉంది. అటు మరో స్విమ్మర్ అలీ ఇ మామ్ ఏడో స్థానంలో నిలిచాడు.