26 July, 2026 | 1:57 AM

సీబీఎస్‌ఈ క్లస్టర్ 7 ఖో-ఖో పోటీలు

26-07-2026 12:00 AM

అల్ఫోర్స్ ఇటెక్నో పాఠశాలలో నిర్వహణ

కొత్తపల్లి, జూలై 25 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో సీబీఎస్‌ఈ క్లస్టర్ 7 ఖో-ఖో పోటీలు శనివారం రెండవ రోజు కొనసాగాయి. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు క్రీడల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని తద్వారా వారికి ఒత్తిడి నుంచి ఉపశమనం కలగడమే కాకుండా పని పట్ల ఆసక్తి పెరుగుతుందని అన్నారు. 

ప్రతి మ్యాచ్ చాలా ఉత్కంఠంగా కొనసాగుతున్నదని, ప్రతి విద్యార్థి స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఖో-ఖో అసోసియేషన్ రిఫరీస్ బోర్డు కన్వీనర్ వి సూర్య ప్రకాష్, అంతర్జాతీయ రిఫరీ రవీందర్, ఖో-ఖో అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్ లు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.