పదేళ్లపాటు విద్యాసంస్థలను ఎందుకు పట్టించుకోలేదు
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ శాసనసభలో గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చర్చ కొనసాగుతుంది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... గత పదేళ్లలో గురుకులాలకు సొంత భవనాలు నిర్మించలేదని, ఇరుకైన అద్దె భవనాల్లోనే నిర్వహించారని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అద్దెలు కూడా చెల్లించకుండా పెండింగ్ లో పెట్టిందని, కానీ, అద్దెలు రాలేదని కొందరు బీఆర్ఎస్ నేతలు ఈ ప్రభుత్వం హయాంలో పాఠశాలలకు తాళాలు వేశారని మండిపడ్డారు. గురుకులాలకు పెండింగ్ లో ఉన్న అద్దె బిల్లలను ప్రజా ప్రభుత్వం చెల్లించిందని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హాయంలో ప్రభుత్వం హాస్టళ్లు, విద్యాసంస్థలు దారుణంగా ఉన్నాయని, ముక్కు మూసుకుని ఉండాల్సి వచ్చిందని గతంలో మాజీ సీఎం మనవడే అన్నాడని బీఆర్ఎస్ పై ఆగ్రహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు అధికారంలో ఉండి విద్య సంస్థలను ఎందుకు పట్టించుకోలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.






