23 April, 2026 | 12:38 AM

బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గానికో గురుకుల పాఠశాల: గంగుల కమలాకర్

18-12-2024 05:22 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై తెలంగాణ శాసనసభలో వాడివేడిగా చర్చ కొనసాగుతోంది. 2014కు ముందు 19 గురుకులాలు మాత్రమే ఉండేవని, ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల ఉండాలని కేసీఆర్ భావించారని బీఆర్ఎస్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ గుర్తు చేశారు. బీసీల కోసం ప్రత్యేకంగా మరో 119 గురుకులాలు ఏర్పాటు చేశారని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా గురుకులాల ఏర్పాటు చేసి బీఆర్ఎస్ హయాంలోనే మొత్తం 260 నుంచి 1090కి పెరిగిందన్నారు. బీఎస్సీ అగ్రికల్చర్ కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. బీఆర్ఎస్ సర్కార్ 40 స్పోర్ట్స్ స్కూళ్లను ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ వచ్చాక వాటిని మూసివేసిందని గంగుల కమలాకర్ పేర్కొన్నారు.