ఎమ్మెల్యే జారే ను కలిసిన సీతారామా ప్రాజెక్టు నిర్వాసితులు
దమ్మపేట,(విజయక్రాంతి): సీతారామ ప్రాజెక్టు నిర్వాసితులు ఆదివారం ఆదివాసి నాయకులు కారం శ్రీరాములు ఆధ్వర్యంలో అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కారం శ్రీరాములు ఎం ఎల్ ఎ జారే కు నిర్వాసితులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు. నిర్వాసితుల కోసం జూలై 30 న పట్వారిగూడెం కళ్యాణ మండపంలో జిల్లా అధికారులతో కలెక్టర్, ఐటీడీఏ పీవో సీతారామ ప్రాజెక్టు అధికారులు, మండల స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్వాసితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరు గ్రామ పంచాయతీల సర్పంచులు కూరం ఆర్జన రావు, మోకళ్ళ.గురుమూర్తి, వంక జానకి రాముడు, కొమరం సుశీల, మాజీ సర్పంచ్ కోరస సాగర్, చెలీకానీ సూరిబాబు, తాటి రాములు, కొండ్రు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.






