26 July, 2026 | 6:57 PM

టిబి జీకేఎస్ లో చేరిన సింగరేణి ఓవర్ మెన్స్

26-07-2026 06:26 PM

కండువా కప్పి ఆహ్వానించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొత్తగూడెం ఏరియా పీవీకే 5 నుండి, సూపర్ వేజెర్స్ (ఓవర్ మెన్స్) టీబీజికేఎస్ లోకి వద్దిరాజు రవిచంద్ర  కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ... కెసిఆర్  మాకు ఓవర్ మెన్స్ గా ఉద్యోగాలు ఇచ్చారని కెసిఆర్  వలనే, సింగరేణి కార్మికుల కు కారుణ్య నియామకాలు, అనేక హక్కులు రావడం జరిగిందన్నారు.  యూనియన్ లో చేరిన వారిలో,గోల్కొండ నవీన్, ఎస్కె అలీమ్, సబ్బని వినీత్, వసీమ్, అజీజ్, తదితరులు యూనియన్ ను బలోపేతం చేయడానికి కృషి చేస్తామని అన్నారు .