26 July, 2026 | 6:59 PM

ఎస్ఐఆర్‌పై పూర్తి అవగాహన కల్పించాలి

26-07-2026 06:17 PM

- మానల మోహన్ రెడ్డి

మల్లాపూర్,(విజయక్రాంతి): ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి అవగాహన పెంచుకొని ప్రజలకు వివరించాలని రాష్ట్ర సహకార కార్పొరేషన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఎస్‌ఐఆర్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి, ప్రజలకు సరైన సమాచారం అందించాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు చొరవ చూపాలని సూచించారు.క్షేత్రస్థాయిలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడం కాంగ్రెస్ శ్రేణుల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.