మన్ కీ బాత్ వీక్షించిన సునీల్ రావు
26-07-2026 06:40 PM
ముకరంపుర,(విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 136వ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' కార్యక్రమంను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు వీక్షించారు. ఆదివారం ఉదయం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, డివిజన్ వాసులతో కలిసి ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు.






