చరిత్రను వక్రీకరిస్తే చెరిగిపోదు !

17-09-2026 | 05:10am

మాలోతు సాగర్ :

వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం(Telangana Armed Peasant Struggle) 1946 సెప్టెంబర్ 11 నుంచి 1951 అక్టోబర్ 21 వరకు ఐదు సం వత్సరాల పాటు సాగింది. ప్రపంచ చరిత్ర(World History)లోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగిన పో రాటమిది. స్వాతంత్య్రం(Independence) వచ్చేనాటికి దేశం లో 565 సంస్థానాలు ఉన్నాయి. వీటిలో అతిపెద్ద రాజ్యం హైదరాబాద్ సంస్థానం(Hyderabad State). నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్(Nizam King Mir Osman Ali Khan) పరిపాలిస్తున్నాడు. తెలంగాణతో పాటు ప్రస్తు త కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాం తాలు ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్నాయి.

తెలంగాణ ప్రాం తంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పో రాటం గ్రామాలలో భూస్వాములు, జ మిందారులు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్ల దోపిడీ, అణిచివేతకు వ్యతిరేకంగా సాగిన పోరాటం అది. గ్రామాల్లో ప్రజలంతా భూ స్వాములకు వెట్టిచాకిరి చేయాలి. భూస్వాముల భూమి దున్నిన తర్వాతనే తమసొం త భూమిని సాగుచేయాలి. అనుకూల సమయంలో భూస్వాముల భూమిని దున్ని విత్తనాలు వేసి, నాట్లునాటి ఆ తర్వా త తమ భూమిలో అడుగుపెట్టాలి.

అప్పటికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండవు. ఫలితంగా తమ భూమిలో తగినంత పంట పండేది కాదు. తాము కట్టవల సిన పన్నులు పోగా తినడానికి తిండి మిగిలేదే కాదు. భూస్వాములకు అప్పులపాల య్యేవారు. దీంతో వెట్టిచాకిరి చేయవలసి వచ్చేది. వృత్తిదారులు తమ ఉత్పత్తులు ఉచితంగా ఇవ్వాలి. అన్ని ఇచ్చినా సరే దొర, జమిందారులు తృప్తిపడే వారే కాదు. కులవృత్తులన్నిటిమీద పన్ను కూడా చెల్లించాలి. పెళ్లి అయినా, చావుకైనా పన్ను తప్పదు. జమిందారులకు కూడా పన్ను చెల్లించవలసిందే.

పన్ను కట్టలేక పారిపోయిన రైతులను వెతికి పట్టుకొచ్చి చిత్ర హింసలు పెట్టి మరీ పన్నులు వసూలు చేసేవారు. భూస్వామి కన్నుపడ్డ మహిళలను వదిలే వారే కాదు. భాషా సాం స్కృతిక వివక్ష కొనసాగేది. తెలుగు మాట్లాడితే చిన్న చూపుతో చూసే ధోరణి ఉండేది. ఉర్దూ లేదా మరాఠీ మాట్లాడే వారిని గౌరవంగా చూసేవారు. తెలుగులో చదువు కునే అవకాశం లేదు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సమస్యల నిలయంగా ఆనా టి తెలంగాణ ఉండేది. ఆ సమస్యలే గ్రామాల్లో భూస్వామ్య, దోపిడీ, పెత్తందారీతనానికి వ్యతిరేకంగా 1930లో ఆంధ్ర మహాసభ ఏర్పడింది.

ఈ ఆంధ్ర మహాసభ తెలుగు భాషా, సాంస్కృతిక సమస్య ల మీద కృషి చేసింది. క్రమంగా అది భాషాపరమైన సమస్యలపైనే కాకుండా రైతులు, కూలీలు, గ్రామీణ పెత్తందారుల దోపిడీ, మాతృభాషకు తగిన స్థానం దక్కకపోవడం ఆంధ్ర మహాసభలో అత్యధికు లను కదిలించింది. బలవంతపు వసూళ్లు, అధిక పన్ను భరించలేని ప్రజలు ఆంధ్ర మహాసభకు దగ్గరయ్యారు. సంఘం తమ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుం దనే గట్టి నమ్మకంతో అన్యాయాన్ని ప్రశ్నిం చే వారంతా సంఘంలో సభ్యులయ్యారు.

1944లో భువనగిరి సభతో ఆంధ్ర మహాసభ స్వభావం మారింది. సాంస్కృతిక సంఘంగా మాత్రమే పరిమి తం కాలేదు. అది రైతాంగ సమస్యల మీద పోరాట సంఘంగా అవతరించింది. సం ఘం పేరుతో రైతుల గుండెల్లో నిలిచింది. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి వంటివారు నాయకత్వంలోకి వచ్చారు. అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి, ఆరు ట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, తదితరులు ఆంధ్ర మహాసభ కార్యకర్తలుగా ఉన్నారు. అన్యాయాలను, అరాచకాలను ప్రశ్నించడం మొదలుపెట్టారు.

వెట్టిచాకిరికి వ్యతి రేకంగా మొదలైన ఈ ప్రతిఘటన  క్రమం గా భూపోరాటంగా మారింది. దున్నేవానికే భూమి దక్కాలని నినదించింది. సోమ రిపోతులుగా ఉండి పెత్తనం చేయడం ఇక చెల్లదని భూస్వాములు, జమిందారులు, దేశముఖ్‌ల మీద తిరుగుబాటు ప్రకటించింది. నిజాం రాచరికపు నిరంకుశ పాలన మీద తిరుగుబాటుగా మారింది. ఊరంతా ఏకమై భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుండి విముక్తి కోసమే కాదు, సామా జిక వివక్ష, అణిచివేత మీద సమైక్య పోరా టం చేసింది.

సాంస్కృతిక ఉద్యమం అన్ని తరగతుల ప్రజలను ఐక్యంచేసి పోరుబాట నడిపించిన చైతన్యం ఈ పోరాటం ప్రత్యేకత. 3000 గ్రామాలలో ఉద్యమం విస్త రించింది. 10లక్షల ఎకరాల భూమిని రై తాంగం స్వాధీనం చేసుకుంది. అక్రమంగా తాకట్టులో ఉన్న భూములను విముక్తి చేసింది. రుణపత్రాలను రద్దు చేసింది. పశువులను పంపిణీ చేసింది. పన్నువసూలు రద్దు చేసింది. గ్రామ రాజ్యాలు నిర్మించింది మహోన్నత తెలంగాణ సాయుధ పోరాటం. ఈ పోరాటం వలన వ్యవసాయ కార్మికుల వేతనాలు పెంచారు.

మహిళలను నిర్ణయాల్లో భాగస్వాములు చేశారు.సమాన హక్కులు అమలు చేశారు. అంటరానితనం నిషేధించారు. ఇవన్నీ ఉద్యమ ప్రస్థానంలో భాగంగా సాగాయి.  స్త్రీ, పురుషులన్న తేడా లేకుండా ఈ మహత్తర పోరాటానికి చిట్యాల ఐలమ్మ చిహ్నం గా నిలిచింది. కుల, మత, ప్రాం తీయ విభేదాలకతీతంగా సాగిన ఉద్యమం ఫలితంగా కుల వివక్షకు తావులేకుండా పోయింది. సామాజిక వంటలు, భోజనాలు సాగాయి. ఎవరు వండారు.. ఎవరు తిన్నారు.. అన్న ప్రశ్నేలేదు.వడ్డించే వారినీ పట్టించుకోలేదు. 

 జమిందారుల దోపిడీ, అణిచివేతకు వ్యతిరేకంగా సాగిన ఈ తెలంగాణ రై తాంగ సాయుధ పోరాటంలో కుల పట్టిం పు కొట్టుకుపోయింది. ఈ పోరాటం నడుస్తుండగానే 1947 ఆగస్టు 15న బ్రిటీష్ పాలకుల నుండి భారతదేశానికి స్వాతం త్రం వచ్చింది. బ్రిటీష్ ఇండియా స్థానంలో స్వతంత్ర భారతదేశం ఆవిర్భవించింది. అప్పటికే స్వతంత్ర రాజ్యాలుగా సాగుతున్న 565 సంస్థానాలు దాదాపు బ్రిటీష్ ఇండియా పాలకులకు అనుకూలంగా నడుచుకున్నవే.

వాటిలో అతిపెద్ద సంస్థా నం నిజాం రాజ్యం. హైదరాబాద్ సంస్థా నం తనకు సామంతరాజులుగా పరిగణించాలని, ఈ 565 సంస్థానాలను స్వతంత్ర భారతదేశంలో లేదా స్వతంత్ర పాకిస్తాన్ లో విలీనం కావాలని బ్రిటీష్ పాలకులు చెప్పలేదు. నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యాంగ ప్రకటించుకోవడానికి సిద్ధపడ్డాడు. స్వతంత్ర భారత ప్రభుత్వం కూడా అంగీకరించింది. నెహ్రూ, పటేల్ ప్రభు త్వం నిజాం రాజుతో 1947లో నవంబర్ 29న యధాతధంగా ఒప్పందంపై సంత కం చేసింది.

ఈ ఒప్పందం ప్రకారం భారత ప్రభుత్వం, హైదరాబాద్ రాజ్యం ఒకరి సార్వభౌమధికారాన్ని మరొకరు గౌరవిస్తారు.. పరస్పరం సహకరించుకుంటారు.. అని హోంమంత్రి సర్దార్ పటేల్ నిజాం రాజ్యాన్ని స్వతంత్రరాజ్యంగా అంగీకరించారు. కానీ, తెలంగాణ ప్రజలు అందుకు ఒప్పుకోలేదు. నరహంతక నిజాం పాలన అంతం కావాలని, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావాలని ఆనాడు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో మహోత్తరమైన పోరాటం సాగింది.

నిజాం నిరం కుశ పాలన తాడోపేడో తేలిపోవాలనే స్థా యిలో తిరగబడ్డారు. అదేస్థాయిలో నిజాం పాలకుల అణిచివేత సాగింది. రజాకార్ల రాక్షస కృత్యాలు కొనసాగాయి. ఇదే సందర్భంగా స్వతంత్ర కాశ్మీర్ సంస్థానాన్ని అ క్కడి ప్రజల తిరుగుబాటుతో 1947 అక్టోబర్ 27న భారత ప్రభుత్వంలో విలీనం చేశారు. కానీ.. నిజాం రాజ్యాన్ని విలీనం చేసుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి కలగలేదు. కారణం ఇక్కడ సాగుతున్న రైతాంగ ఉద్యమాన్ని నిజాం రాజు అణిచివేయగలరని భావించారు.

అయితే, అంచ నాలు తలకిందులయ్యాయి. రైతాంగ  పో రాటం ఉధృతంగా సాగింది. నిజాం పునాదులను కదిలించింది. గోల్కొండ ఖిల్లా కింద నీ గోరికడతం కొడుకో.. అని ఉద్యమకారులు నిజాం నవాబులను గల్లా పట్టి గుంజి నడిబజారులో నిలబెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఏమాత్రం ఆలస్యమైనా నిజాం రాచరిక సౌధం కుప్పకూలడం ఖాయం.. తెలంగాణ గడ్డమీద ఎర్రజెండా ఎగరడం ఖాయం.. అన్న పరిస్థితి ఏర్పడింది. ఇది నెహ్రూ,  పటేల్ ప్రభుత్వానికి ఇష్టం లేదు.

అదే జరిగితే భవిష్యత్‌లో భారత పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించలేనంత అమాయకులు కాదు వారు. అందు కే ఆగమేఘాల మీద సైన్యాన్ని తరలించారు. 1948 సెప్టెంబర్ 13న పటేల్ సై న్యం హైదరాబాద్‌లో దిగింది. అప్పటికే జబ్బలు జారేసి.. నిజాం రాజు సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించాడు. 

యుద్ధంలో నిజాం సైన్యాన్ని లొంగదీసుకున్నామన్నా పటేల్ సైన్యం శత్రువు లను శిక్షించలేదు. అందలం ఎక్కించి, సకల సౌకర్యాలు కల్పించిన సర్దార్ పటేల్.. ఉక్కుమనిషి సైన్యాన్ని పంపి నిజాం రా జును లొంగదీసుకున్నాడని ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి ప్రచారం చేస్తోంది. యథాతథంగా ఒప్పందం చేసుకున్న విషయాన్ని కావాలనే దాచి పెడుతున్నారు. 

తెలంగాణ రై తాంగ సాయుధ పోరాట ధాటికి తట్టుకోలేక రాజు చేతులెత్తేస్తేనే ఆ సమయంలో పటేల్ సైన్యం రంగంలోకి దిగింది. ఈ  విషయాన్ని కావాలనే విస్మరిస్తున్నారు. పటేల్ సైన్యాలు వచ్చి ఉండక పోతే నిజాం రాచరికం కుప్పకూలేది. తెలంగాణ కమ్యూనిస్టుల వశమయ్యేది. భూ స్వామ్య వ్యవస్థ రద్దయ్యేది. దున్నేవాడికే భూమి దక్కే ది. నిరంకుశ నిజాం రాజుకు నరహంతక రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీకి ప్రజాకోర్టులో శిక్ష పడేది. పటేల్ సైన్యాలు రంగంలోకి దిగి వారిని కాపాడారు.

తెలంగాణ గడ్డ కమ్యూనిస్టుల వశం కాకుండా అడ్డుకున్నారు. పేదలు దక్కించుకున్న భూములు గుంజుకొని మళ్లీ భూ స్వాములకు అప్పగించారు. హైదరాబాద్ సంస్థానాన్ని వదిలిపెట్టి పారిపోయిన వా రంతా పటేల్ సైన్యాల రాకతో మళ్లీ గ్రా మాలకు తరలివచ్చారు. పటేల్ సైన్యం వారికి పూర్తి భద్రత కల్పించింది. కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన రైతాంగ సాయుధ పోరాట వీరులను అణచివేసే పని మొదలుపెట్టారు. రైతాంగ పోరాటం సాగకపోతే 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యేదే కాదు.

ఆ ఘట్టం చరిత్రలో ఉం డేదే కాదు. ఇది పూర్తిగా  ఎర్రజెండా విజయమే. సుదీర్ఘ కాలంపాటు సాగిన వీరో చిత రైతాంగ పోరాటం ఫలితంగా విలీనం కోరుకున్న తెలంగాణ ప్రజలు, దానికోసం డిమాండ్ చేస్తూ వచ్చిన కమ్యూనిస్టు పార్టీ ఈ విలీనాన్ని ఆహ్వానించింది. అప్పటికే పేద రైతులు సాగు చేసుకుంటున్న పది లక్షల ఎకరాల భూమిమీద సాగుదారులకే హక్కు ఉండాలని రైతులు కోరుకున్నారు. వారికి నాయకత్వం వహిస్తున్న కమ్యూనిస్టు పార్టీ అదే డిమాండ్ చేసింది.

కానీ నెహ్రూ, పటేల్ సైన్యం వచ్చి ఆ భూములు గుంజుకొని భూస్వాములకు కట్టబెట్టడానికి, కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణిచివేయ డానికి ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. పోరాడుతున్న ప్రజల మీద సైన్యం విరుచుకుపడ్డది. రాజు పేరు మారి రాజప్రముఖ్ పేరుతో ఉన్న పాలకులు ఉస్మాన్ అలీ ఖా న్, ఖాసిం రజ్వీ, రజాక్ సైన్యానికి తో డుగా పటేల్ సైన్యం వచ్చి చేరింది.  నిజాం నిరం కుశత్వం 1500 మందిని, పటేల్ సైన్యం 2500 మందిని పొట్టనపెట్టుకుంది.

అయినా పోరాటాన్ని అణచడం సైన్యానికి కూడా సాధ్యం కాలేదు. భూమి మీద హ క్కులు ఇవ్వకుండా, భూమి పంచకుండా పోరాటం ఆగదని నెహ్రూ ప్రభు త్వానికి అర్థమైంది. రక్షిత కౌలుదారి చట్టం 1951ని ప్రకటించింది.  ఈ నేపథ్యంలో 1951 అక్టోబర్ 21న సాయుధ రైతాంగ పోరాటాన్ని విరమించారు.

 వ్యాసకర్త ః ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కమిటీ సభ్యుడు, 7013805411

మరిన్ని వార్తలు