13 July, 2026 | 11:56 PM

Breaking News

కొండపాకలోనే యంగ్ ఇండియా పాఠశాల ఏర్పాటు చేయాలి   •   గిరిజన విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే ఐటీడీఏ లక్ష్యం   •   రాష్ట్ర స్థాయి క్రీడాపోటీల్లో జిల్లా పోలీసుల ప్రతిభ   •   పుల్లూరు బండలో రామయ్య తలంబ్రాల పంపిణి   •   చేనేత రంగానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి   •   బాలకార్మికుడికి విముక్తి… బడిలో చేర్పించిన సర్పంచ్   •   కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం   •   తప్పకుండా ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలి   •   33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •  

ఆల్బెండజోల్ మాత్రాల పంపిణి

13-07-2026 09:10 PM

అయిజ: గద్వాల జిల్లా అయిజ మునిసిపాలిటీలోని భరత్ నగర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో  విద్యార్థులకు మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన జాతీయ నులి పురుగుల నివారణోత్సవ కార్యక్రమాన్ని ప్రతి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని 1 నుండి 19 సంవత్సరాల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రం తప్పకుండా వేయించాలని అన్నారు.

చిన్నారుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు పునాది అని, ఈ మాత్రల వల్ల రక్తహీనత పోషకాహార మరియు పిల్లల ఎదుగుదలకు సమస్యలను నివారించవచ్చునని అన్నారు. సోమవారం రోజు ఈ మాత్రలు తీసుకొని వారు ఈనెల 20 వ తేదీ రోజు నిర్వహించే మ్యాప్ - అప్ - డే రోజు ఈ మాత్రలు డాక్టర్ల సమక్షంలో అందజేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్, ఎం పి హెచ్ ఈ ఓ ఓబులేసు, ఏఎన్ఎంలు,ఆశా కార్యకర్తలు,  టిఆర్ఎస్ కౌన్సిలర్లు మరియు నాయకులు పాల్గొన్నారు.