22 August, 2026 | 1:47 PM

సురవరం ఆశయాలే సిపిఐమార్గం

22-08-2026 01:43 PM

హుజూర్ నగర్,ఆగస్టు 22 (విజయక్రాంతి): సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆశయాలే సిపిఐ మార్గం అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాస్, సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో సురవరం సుధాకర్ రెడ్డి జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సామాజిక న్యాయం సమానత్వం హక్కుల కోసం కార్మికుల రైతుల పక్షాన ఆయన చేసిన పోరాటాలు మరువలేని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో సురవరం కృషి వామపక్ష ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తుంది అన్నారు. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ఆశయాలను సాధించడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు కొప్పోజు సూర్యనారాయణ, దొంతగాని సత్యనారాయణ, ఇందిరాల వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ చేన్నగాని సైదులు, సుందరి పద్మ, యల్లావుల రమేష్, యల్లావుల ఉమ, జక్కుల రమేష్, జడ వెంకన్న, చక్రాల స్టాలిన్, రవీందర్ రెడ్డి, బత్తిని మల్లయ్య,జక్కుల రమణ, తదితరులు పాల్గొన్నారు.