22 August, 2026 | 2:25 PM

సోమ్లా తండాలో పోలీసుల కార్డెన్ సర్చ్

22-08-2026 01:48 PM

మహబూబాబాద్, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఆదేశాలు మేరకు మరిపెడ సీ ఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో మరిపెడ మండలం సోమ్లా తండాలో కార్డన్ సెర్చ్  కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడుంబా తయారీ కేంద్రాలే లక్ష్యంగా నిర్వహించారు. చక్కెర ద్వారా నాటుసారా కాస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. సుమారు 1,500 లీటర్ల షుగర్, ఈస్ట్ కలిపిన పానకం ధ్వసం చేశారు. 20లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని, నాటు సారా తరలించడానికి ఉపయోగిస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అనంతరం సీ ఐ పవన్ కుమార్ సమాజంలో జరుగుతున్న  సైబర్ నేరాలు, రోడ్ భద్రత, మత్తు పదార్ధాలు, ఇంట్లో పిల్లలు ప్రవర్తనపై అవగాహన కల్పించడం జరిగింది. చట్ట వ్యతిరేక చర్యలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మరిపెడ ఎస్ ఐ గండ్రాతి సతీష్, చిన్న గూడూరు ఎస్ ఐ కుశకుమార్, సీరోల్ ఎస్ ఐ సంతోష్, సుమారు 20 మంది సిబ్బంది పాల్గొన్నారు.