భూ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ
ఎలివేటెడ్ కారిడారుకు భూములు ఇచ్చిన రైతులు
మేడ్చల్, మే 14(విజయ క్రాంతి): సికింద్రాబాదు నుండి శామీర్ పేట్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూమి ఇచ్చిన తూంకుంట రైతులకు మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి చెక్కులు పంపిణీ చేశారు. గురువారం కలెక్టర్ తన ఛాంబర్లో సికింద్రాబాదు నుండి శామీర్ పేట్ వరకు రాజీవ్ రహదారి నిర్మాణానికి తూంకుంట గ్రామంలో 24 ఏకరాలకు గాను మొదటి విడతగా 14203 చదరపు గజాల స్థలాన్ని ఇచ్చిన రైతులకు అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి 103 కోట్ల రూపాయల చెక్కును అందజేసారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి దఫాగా ఈ చెక్కులు అందించడం జరిగిందని, మిగిలిన వారికి తరువాత అందించడం జరుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. తమ భూమికి చదరపు గజం లక్ష రూపాయలుగా ధర నిర్ణయించడంలో కలెక్టర్ చోరవ తీసుకున్నారని రైతులు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు అందజేసారు. మాజీ సర్పంచ్ సాగర్, సంజయ్ అగర్వాల్, విజయలక్ష్మి, సతీష్, పద్మప్రసాద్, అరుణ వీరందరు కలెక్టర్ ను శాలువతో సన్మానించారు.






