15 May, 2026 | 1:25 AM

హాస్టల్‌లో యువతి అనుమానాస్పద మృతి

15-05-2026 12:20 AM

జూబ్లీహిల్స్, మే 14(విజయక్రాంతి): ఓ ప్రైవేట్ హాస్టల్‌లో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన మధురానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధురానగర్‌లోని భార్గవి లేడీస్ హాస్టల్‌లో హరిత అనే యువతి ఉంటోంది. భవనంలోని పెంట్‌హౌస్‌లో ఒంటరిగా బస చేస్తోంది.

ఈ క్రమం లో యువతి మృతదేహం ఆమె గదిలోని బాత్‌రూంలో కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ఇది గమనించిన భవన యజమాని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీ సులు యువతి బస చేసిన గది పరిసరాలను పరిశీలించారు. రెండు రోజుల క్రితమే అనారోగ్యంతో యువతి మరణించినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.