ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గడియారాల పంపిణీ
16-07-2026 12:13 AM
తాడ్వాయి, జూలై, 15( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో బుధవారం ఇందిర లబ్ధిదారులు ఐదుగురికి ప్రతినిధులు గోడ గడియారాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించిన నిధులతో పేదలు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుమలత రామరాజు, ఉపసర్పంచ్ గడిల రాజశేఖర్ రావు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు విట్టల్ రావు, నాయకులు నరసింహ రెడ్డి,చాకలి రాజయ్య పాల్గొన్నారు.






