16 July, 2026 | 12:44 AM

నృసింహునికి నిత్య పూజలు

16-07-2026 12:12 AM

యాదగిరిగుట్ట, జూలై 15 (విజయక్రాంతి) : యాదగిరిగుట్ట దేవస్థానంలో బుధవారం నిత్య పూజలు వైభవంగా నిర్వ హించారు. సుప్రభాత సేవతో గర్భగుడి లో కొలువు దీరిన స్వయంభులను సువర్ణ ప్రతిష్ఠ మూర్తులను వేదమంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్పించారు. ప్రాకారమండ పంలో నృసింహ హోమం, నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి వారి నిత్య రాబడి రూ.14,15,625 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.