12 July, 2026 | 3:54 PM

Breaking News

విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •  

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

30-03-2026 06:25 PM

బిక్కనూరు,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా బిక్కనూరు మండలంలోని లక్ష్మీదేవిపల్లె, ర్యాగట్లపల్లి గ్రామాల్లో లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను కాంగ్రెస్ నాయకులు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమ్ రెడ్డి, DCC సెక్రటరీ లింగాల రాజా బాబు గౌడ్, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్ పాల్గొన్నారు.

అనారోగ్యంతో బాధపడుతున్న ఆరు కుటుంబాలకు చెక్కులను నేరుగా వారి ఇళ్ల వద్దకే అందజేశారు. పుల్లూరి భారతి (₹41,000), మగిని ఎల్లయ్య (₹60,000), నాగన్నాగరి సావిత్రి (₹60,000)లకు సాయం అందించారు. ప్రభుత్వం నేరుగా ఇంటి వద్దకు వచ్చి సాయం చేయడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.