23 May, 2026 | 1:33 PM

నులిపురుగుల నివారణకు మాత్రలు పంపిణీ

11-08-2025 07:23 PM

అలంపూర్: పిల్లలకు శరీరంలో ఏర్పడే నులిపురుగులు రక్తహీనత తగ్గి పోషణ మెరుగుపడుతుందని కాబట్టి వాటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తహసిల్దార్ జోషి శ్రీనివాస్ శర్మ(Tehsildar Joshi Srinivas Sharma) అన్నారు. సోమవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించి 20070 మంది విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు(ఆల్బెండజోల్) తినిపించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాసిల్దార్ మాట్లాడుతూ, ఒకటి నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ మాత్రలు ఉచితంగా పంపిణీ చేయబడుతుందని  విద్యార్థులు ప్రతి ఒక్కరూ తినడానికి ముందు తర్వాత పరిశుభ్రంగా చేతులను కడుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోకుండా అపరిశుభ్రతతో భోజనం చేస్తే క్రిములు శరీరంలోకి వెళ్లి నులిపురుగులు తయారవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హేమా మానస, సూపర్వైజర్ ,హెలెన్ చంద్రన్న, ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.