4 March, 2026 | 8:13 PM

విద్యార్థులకు ఉచితంగా ప్యాడ్లు పంపిణీ

04-03-2026 06:58 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఉచితంగా పరీక్ష ప్యాడ్స్ అందించారు, బుధవారం పట్టణంలోని.. జెడ్పీఎస్ఎస్ బాలుర, బాలికల అలాగే జీజేసీ హై స్కూల్ సుల్తానాబాద్ నందు పాడ్స్ పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వంతోపాటు వివిధ స్వచ్ఛంగా సంస్థలు అన్ని విధాల అండగా ఉంటున్నాయని కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు బుర్ర ఓంకార్ గౌడ్, కోశాధికారి తుమ్మ వెంకటేశం, ప్రధాన కార్యదర్శి తుమ్మ నిశాంత్, దేవసాని సన్నీ, శ్రీనివాస్, ఎల్లా మల్లేశం, ప్రధానోపాధ్యాయులు పద్మశ్రీ టి దివాకర్ రావు, S.రత్నాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.