12 June, 2026 | 8:28 PM

కరత్వాడ భూ నిర్వాసితులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే

12-06-2026 07:26 PM

బోథ్,(విజయక్రాంతి): బోతు మండలంలోని కరత్వాడ ప్రాజెక్టు భూనిర్వాసితులను ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కరత్వాడ గ్రామానికి చెందిన భూ నిర్వాసితులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి వారి బాధలను చెప్పడం జరిగింది ప్రాజెక్టు నిర్మిస్తున్న సమయంలో నష్టపరిహారం అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు తమను పట్టించుకోవడంలేదని వాపోయారు. ఈ విషయమై జిల్లా అధికారులతో మాట్లాడి బాధితులకు అండగా నిలుస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. భూ నిర్వాసితుల వెంట మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ గ్రామ సర్పంచ్ దుర్వా విశ్వేశ్వర్ పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు