విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ
నాగర్‌కుంట సర్పంచ్ పాలమాకుల మల్లయ్య
విజయక్రాంతి, షాబాద్: షాబాద్ మండలంలోని నాగర్‌కుంట గ్రామంలోని ఎంపీయుపిఎస్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను సర్పంచ్ పాలమాకుల మల్లయ్య, పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని సూచించారు.ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, పాఠ్య పుస్తకాలను పూర్తిగా అధ్యయనం చేసి మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. గ్రామ అభివృద్ధితో పాటు విద్యాభివృద్ధికి కూడా గ్రామపంచాయతీ కట్టుబడి ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పెద్దలళ్ల గోపాల్, విమల, రామకృష్ణ, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.






