17 June, 2026 | 12:45 PM

రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

17-06-2026 11:49 AM

ఆరుట్ల: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆరుట్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) మాట్లాడుతూ... కొత్త తరానికి సరికొత్త అవకాశాలు ఇవ్వాలని, విద్యకు పెద్దపీట వేయాలని, ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుంటారని తెలిపారు. భావితరాల కోసం ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని చేపట్టిందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణచం చేపట్టామని పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను(Telangana Public Schools) తెలంగాణ వ్యాప్తంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అత్యుత్తమ విద్య, వైద్యం నినాదంతో సీఎం రేవంత్ ముందుకెళ్తున్నారని సూచించారు.