17 June, 2026 | 12:11 PM

Breaking News

రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •  

చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!

17-06-2026 11:26 AM

లోసుగులను ఆసరాగా చేసుకొని అందిన కాడికి దోచుకుపోతున్నారు. 

మామూళ్లతో అధికారుల కళ్ళు మూయిస్తున్న మొరం మాఫియా.

బోథ్, జూన్ 17(విజయక్రాంతి): బోథ్ నియోజకవర్గ( Boath Constituency) పరిధిలో అటవీ శాఖ, రెవెన్యూ శాఖల మధ్యన ఉన్న అటవీ భూముల లెక్క ఇప్పటికీ తేలక పోవడంతో కొంతమంది మొరం మాఫియా కీడుగాలకు అందినంత దోచుకునే అవకాశం లభించింది. దీంతో నేరడిగొండ బోత్ ఇచ్చోడ బజార్హత్నూర్ మండలాల్లో విచ్చలవిడిగా మొరం వ్యాపారం కొనసాగుతున్నది. రాత్రిపూట మొరం మాఫియా మూట కాపలాదారులను పెట్టి విచ్చలవిడిగా మొరం తవ్వుకు పోతున్నారు.

నేరడిగొండ మండలంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిని అనుకుని ఉన్న కుమారి చుట్టుపక్కల ఉన్న ఎర్ర మొరం గుట్టలు మొరం మాఫియా బంగారు బాతులా మారాయి. 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఎర్ర మొరం క్వారీని ఆనుకొని అటవీశాఖ భూమి ఉండడం ఆ భూమిలో ఏ కొంచెం తవ్విన అటవీ శాఖ వారు పట్టుకొని జరిమాణాలు విధిస్తుండటంతో అక్రమ మొరం వ్యాపారులు రెవెన్యూ భూములపై దృష్టి సారించి విచ్చలవిడిగా తరలించకపోతున్నారు.

లోకల్ మొరం తవ్వేది ఇక్కడే

లోకల్ నేరడిగొండ మండలంలోని వడూర్ ,రాజుల తాండ, బుద్ధికొండ, బోథ్ మండలంలోని పిప్పలదరి ,కొత్త కరత్వాడ ,బోత్, ధనుర్ , రఘునాథపూర్, సోనాల మండలంలోని సాకేర, కోట కె సోనాల టివి టి గ్రామాల పరిసరాలలో ఉన్న గుట్టలలో నుండి ప్రతిరోజు వందల సంఖ్యలో తిప్పల ద్వారా మొరం తరలించకు పోతున్నారు . 

పట్టపగలు యదేచ్చగా ట్రాక్టర్ల లో తరలింపు

బోథ్ సోనాల మండలాల్లో అక్రమ మొరం  తవ్వకాలు ప్రభుత్వ కార్యాలయాల ముందు నుండి పట్టపగలే మొరం ట్రాక్టర్లో తరలిస్తున్నారు. అడిగేవాడు లేకపోవడంతో మొరం మాఫియా పట్టపగలు గుట్టలను తవేసి మొరం అమ్మకాలు కొనసాగిస్తున్నారు. కొంతకాలం పాటు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల కంటూ అధికారుల వద్ద నుండి అనుమతులు పొంది బయట వ్యక్తులకు విచ్చలవిడిగా విక్రయించు కున్నారు.. 

యదేచ్చగా వాల్టా చట్టం ఉల్లంఘన.. 

సహజ వనరులు అయినా మొరం గుట్టలను పట్టపగలు రాత్రిపూట తవ్వకాలు కొనసాగిస్తూ విచ్చల విడిగా ఇసుక మొరం అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భవనాలకు సమీపంలోని వాగుల నుండి నల్ల ఇసుకను పునాదులకు అవసరమైన పునాది రాళ్లను తరలిస్తున్నారు. పో చ్చర సమీపంలో నిర్మిస్తున్న ఓ ప్రైవేటు భవనానికి గ్రామం సమీపంలోని వాగులో నుండి నల్ల ఇసుక పునాది రాళ్లను తరలించిపోయారు. అక్రమ దందా కొనసాగుతున్న అటవీ శాఖ రెవెన్యూ శాఖల అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా 20 ఫీట్ల లోతులో

వాస్తవానికి మైనింగ్ అధికారుల నిబంధనల ప్రకారం మూడు ఫీట్ల కన్నా ఎక్కువ లోతుగా తగిలితే అవసరమైన అనుమతులు పొందాల్సి ఉంటుంది కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే కొత్త కర త్వాడ మిషన్ భగీరథ ట్యాంక్ కుడివైపున ఉన్న రెవెన్యూ గుట్టను 15 నుండి 20 ఫీట్ల వరకు తవ్వి మొరం తరలించారు. ఇంత బహిరంగంగా జరుగుతున్న ఈ వ్యాపారంపై అధికారులు చూడనట్లు వ్యవహరిస్తుండటంతో విమర్శలు వస్తున్నాయి.

రెవెన్యూ రికార్డుల్లో ఉన్న బట్టలు తమవి కావలి అటవీశాఖ వారు పేర్కొంటుండగా రెవెన్యూ శాఖ వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ శాఖ గుట్టలుగా పేర్కొంటున్న వాటి పైన ఉన్న చెట్లు అటవీ శాఖ వారివి అయితే గుట్టలేము రెవెన్యూ శాఖ వారిగుట్టపై చెట్లను కొడితే అటవీ శాఖ వారు కేసులు చేస్తుంటే మొరం తీసుకువెళ్తే తమకు సంబంధం లేదంటూ అటవీ శాఖ వారు చేతులెత్తేస్తున్నారు రెండు శాఖల సమన్వయ లోపం వల్ల కోట్లాది రూపాయల మొరం తరలిపోయింది .