24 July, 2026 | 3:21 PM

కేటీఆర్ జన్మదినం సందర్భంగా పండ్లు, బ్రెడ్, పాల పంపిణీ

24-07-2026 02:20 PM

టేకులపల్లి, (విజయక్రాంతి): మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని టేకులపల్లి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు వరప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టేకులపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు, ముత్యాలంపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్, పాలను అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ సేవా భావాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్‌రావు, జిల్లా నాయకులు భూక్య దల్ సింగ్, టేకులపల్లి సర్పంచ్, మండల ప్రధాన కార్యదర్శి బోడ బాలు నాయక్, మాజీ ఎంపీటీసీ జాలాది అప్పారావు, జిల్లా నాయకులు బానోతు రామా, ఉద్యమకారులు తేజావత్ రవి, కుమ్మరి కిరణ్ కుమార్, రాంపురం సర్పంచ్ బర్మావత్ శివ నాయక్, మహిళా మండల అధ్యక్షురాలు ఆమడ రేణుక, నాగభూషణం, వసంత, స్వరూప, లఖపతి, నామాల బిక్షం, యూత్ మండల ప్రధాన కార్యదర్శి బుర్రి వెంకటేశు, మాజీ సర్పంచ్ సురేందర్ నాయక్, బానోతు రవి, ముచ్చ జయరాజు, లఖపతి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.