24 July, 2026 | 3:23 PM

ఎన్ఎస్ఈయుఐ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్

24-07-2026 02:18 PM

బోధన్ జులై 24 (విజయక్రాంతి): నీట్ విద్యార్థుల అరెస్టులను నిరసిస్తూ ఎన్ఎస్ఈయూఐ ఆధ్వర్యంలో శుక్రవారం సాలూరలో విద్యా సంస్థల బంద్ నిర్వహించారు. ఎన్ఎస్యూఐ నాయకుడు అనిల్ మాట్లాడుతూ... శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీ చేసి అక్రమ అరెస్టులు చేయడం సరికాదన్నారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.