చెత్తబుట్టిల పంపిణీ
25-08-2026 10:37 PM
నిర్మల్,(విజయక్రాంతి): సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో తడి చెత్త, పొడి చెత్త సేకరణ కోసం బుట్టలను గ్రామస్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో రామకృష్ణ హాజరయ్యారు. తడి, పొడి చెత్త కోసం అందజేసిన బుట్టలను నిర్దేశిత ప్రయోజనానికే వినియోగించాలని సూచించారు. ప్రతి ఇంటి వద్ద తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం ద్వారా గ్రామ పారిశుద్ధ్యం మెరుగుపడుతుందని తెలిపారు. అనంతరం భీమన్న ఆలయం వద్ద వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం రాము, ఎంపీఓ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి సుమయా తస్కిన్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






