26 August, 2026 | 12:42 AM

ఇసుక వేలం.. రూ.2.59 లక్షల ఆదాయం

25-08-2026 11:20 PM

అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు

పాపన్నపేట: మండలంలో మంజీరా నది నుంచి అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని పాపన్నపేట తహసిల్దార్ సతీష్ హెచ్చరించారు. మండల పరిధిలోని కుర్తివాడ గ్రామ శివారులో అక్రమంగా నిలువచేసిన ఇసుక నిల్వలను సీజ్ చేయగా.. మంగళవారం వేలం నిర్వహించారు. మొత్తం 462 క్యూబిక్ మీటర్ల ఇసుకకు వేలం నిర్వహించగా అదే గ్రామానికి చెందిన సాతిల్లి సత్యనారాయణ ఒక్క క్యూబిక్ మీటరుకు రూ.562 చొప్పున మొత్తం 462 క్యూబిక్ మీటర్ ల ఇసుకను వేలంలో పాల్గొని దక్కించున్నారు. ఆర్ఐ శరత్, గ్రామ సర్పంచి చెట్టుకింది శ్రీధర్, గ్రామస్తులు ఉన్నారు.