26 August, 2026 | 12:47 AM

భక్తిశ్రద్ధలతో ఎల్లమ్మకు బోనాలు

25-08-2026 11:15 PM

శివంపేట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా శివంపేట  మండలం గంగాయి పల్లి  గ్రామంలో శ్రావణ మంగళవారం బోనాల పండుగను  గ్రామపంచాయతీ పాలకమండలి ఆధ్వర్యంలో ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఎల్లమ్మకు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బోనాల వేడుకల్లో భాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు ఎత్తుకుని గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా తరలివెళ్లారు. శివ శక్తుల ఆటలతో పోతురాజుల పాటలు, డప్పుల మోతలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

చిన్నారులు, యువకులు, మహిళలు, గ్రామ పెద్దలు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ప్రతి ఏటా నిర్వహించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా గ్రామదేవతలకు బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో పండుగను జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవెల్లి సాయిలు , మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు తాటి పవన్ కుమార్ గుప్తా గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యులు,గ్రామ పెద్దలు,యువకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.