17-01-2026 06:51:04 PM
డిప్యూటీ డీఎంహెచ్ఓ చంద్రశేఖర్
నూతనకల్,(విజయక్రాంతి): క్షేత్రస్థాయిలో ప్రజలకు అందే వైద్య సేవలపై పర్యవేక్షణ కోసమే జన ఆరోగ్య సమితి కమిటీలు పనిచేస్తాయని డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ. చంద్రశేఖర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జన ఆరోగ్య సమితి కమిటీపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లోని ప్రాథమిక ఉప కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని దీర్ఘకాలిక రోగాలను గుర్తించి, పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేయాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నూతనకల్ గ్రామ సర్పంచ్ మహేశ్వరం మల్లికార్జున్-శిల్ప, కుంట్ల గ్రామ సర్పంచ్ అంజపల్లి నరసమ్మ, మండల వైద్యాధికారి అశ్రితారెడ్డి, సి.హెచ్.ఓ. చరణ్ నాయక్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.