calender_icon.png 26 November, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ

25-11-2025 10:16:54 PM

కుంటాల (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేయాలని ఆదేశించడంతో మంగళవారం రోజు కుంటాల మండలంలోని విట్టాపూర్ పెంచికల్ పాడు గ్రామాలతో పాటు ఆయా గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రతి ఒక్కరికి ఇందిరా మహిళా శక్తి ద్వారా డాక్రా సంఘ మహిళలకు ప్రజాపాలన ప్రభుత్వంలో చీరలను పంపించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లక్ష్మి రమేష్ మహిళా సంఘాల సభ్యురాలు సందోల్ల లక్ష్మి వివో పూజ కారోబారి లక్ష్మణ్ మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.