25-11-2025 10:15:19 PM
చేగుంట (విజయక్రాంతి): చేగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన తాడేపు వెంగల్ రావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మండలంలో సిహెచ్ శ్రీనివాస్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉంటూ మండలంలో తనవంతుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు, ఈ సందర్బంగా తాడేపు వెంగళరావు మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రావడానికి కృషిచేసిన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి వివేక్ కి, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ కి, మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కి, మండల నాయకులకి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.