27 July, 2026 | 6:58 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

నేడు కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ ముందు ధర్నా

26-11-2025 12:00 AM

నకిరేకల్ నవంబర్ 25(విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ  నేడు నల్లగొండ కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను రైతులు, కార్మికులు, అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం  రాష్ట్ర మహిళా   కన్వీనర్ కందాల ప్రమీల కోరారు. మంగళవారం నకిరేకల్ పట్టణంలోని నర్రా రాఘవరెడ్డి భవనంలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు.

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను, అమలు చేస్తున్న విధానాన్ని వెంటనే రద్దు చేయాలని  సిఐటియు, రైతు సంఘం ,వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో  కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తు న్నామని ఆమె తెలిపారు.

రైతులు కూలీలు వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆమే విజ్ఞప్తి చేశారు.  ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వంటేపాక వెంకటేశ్వర్లు, ఆదిమల్లసుధీర్, రైతు సంఘం నాయకులు గింజల లక్ష్మి స్వరూప, వ్య.కా.సా నాయకులు సాకుంట్ల నరసింహ, తాజేశ్వర్, కృష్ణ , శ్రీను, నరసింహ తదితరులు పాల్గొన్నారు.